బంటి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
సూర్యాపేట టౌన్: ప్రభుత్వం వడ్లకొండ కృష్ణ ఆలియాస్ మాల బంటి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కుల నిర్మూలన సంఘం గౌరవ అధ్యక్షురాలు గుత్తా జ్యోత్స్న, రాష్ట్ర అధ్యక్షుడు వహీద్ అన్నారు. ఇటీవల పరువు హత్యకు గురైన మాల బంటి కుటుంబ సభ్యులను శనివారం సంఘం నాయకులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మృతుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాంతర, మతాంతర వివాహాలకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుల నిర్మూలన సంఘం నాయకులు జ్యోతి, యూసఫ్‌బి, కృష్ణచంద్, కె.సురేష్, బీబీ.శ్యామ్, రాఘవేంద్రప్రసాద్, చింతపల్లి ప్రభాకర్, వేణు, శేఖర్, ఆవుల నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment