ఏబీఏపీని బలోపేతం చేయాలి
సూర్యాపేట: అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ (ఏబీఏపీ)ని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయాలని ఆ సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ కోఆర్డినేటర్ రాచర్ల రమేష్, తెలంగాణ అధ్యక్షుడు టీవీ.పుల్లంరాజు అన్నారు. శనివారం సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు రంగు ముత్యంరాజు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. శబరిమలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసేలా ఏబీఏపీ కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్షలో సేవ చేస్తున్న వారిని సన్మానించారు. ఈ సమావేశంలో సంస్థ జాతీయ కార్యదర్శి సరిశెట్టి రాజేష్, రాష్ట్ర కార్యదర్శి కర్కా సిద్ధు, కోశాధికారి మూడ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గంగాధర్ స్వామి, కమిటీ సభ్యులు భాస్కరాచారి, మాధప్ప, ఇస్లావత్ నగేష్, రాము, భాస్కర్, సాగర్, గురవయ్య, సుంకాని శ్రీనివాస్, రాఘవశెట్టి, పులుసు యల్లేష్, మొరిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment