సూర్యాపేటటౌన్: రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యాలు 12నెలల జీతాన్ని ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బస్కూరి కేపీ కుమార్ డిమాండ్ చేశారు. టీపీయూఎస్ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతతో పాటు ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ప్రైవేట్ టీచర్లపై వివిధ పాఠశాలల్లో జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కళింగం, ఉపేందర్, బచ్చలకూరి జానయ్య, మహేష్, రాజశేఖర్, ఆర్.రమేష్, సోమరాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment