జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలకుగాను ప్రత్యేకాధికారులను నియమించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి (ఏఆర్‌ఓ)తో పాటు ఎంపీడీఓలు కీలక పాత్ర పోషిస్తారు. 23 మండలాలకు 23 మంది ఆర్‌ఓలు, 4 ఎంపీటీసీ స్థానాలకు ఒకరు చొప్పున ఏఆర్‌ఓలను నియమించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రిజర్వేషన్ల అమలు, పోలింగ్ కేంద్రాల కేటాయింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణపై దృష్టి సారించారు. అదేవిధంగా ఎన్నికలకు అవసరమైన ప్రిసైడింగ్ అధికారి (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి (ఓపీఓ), రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమిస్తారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో మాస్టర్ ట్రైనర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరంతా జిల్లా, మండలాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగు నీరు, ప్రహరీ, లైటింగ్, ల్యాంప్‌లు తదితర మౌలిక వసతులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ ఏ అవసరం ఉందో గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment