పచ్చదనానికి ప్రణాళిక
ఫ నయనానందకరం.. ఎదుర్కోలు మహోత్సవం
చిలుకూరు: ఈ ఏడాది జూన్‌లో నిర్వహించే వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు పెంచే కార్యాచరణ సిద్ధం చేశారు. గ్రామాల్లో కార్యదర్శులు, ఉపాధిహామీ టీఏలు, కూలీలకు మొక్కలు పెంచడం పై ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు శిక్షణ పూర్తి చేశారు. మట్టిని, ఎరువుల మిశ్రమంతో ఉపాధిహామీ కూలీలు మొక్కల సంచులు మట్టితో నింపి విత్తనాలు నాటారు. నిత్యం ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓలు, టీఏలు, ఈసీలు గ్రామ నర్సరీలను సందర్శించి నిర్వాహకులకు తగిన సూచనలు చేస్తున్నారు.
ఒక్కో మొక్కకు రూ.8నుంచి
రూ.10 వరకు ఖర్చు
జిల్లా గ్రామీణాబివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మొక్కల పెంపకం చేపడుతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ చొప్పున మొత్తం జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలకు గాను 475 జీపీల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. ప్రతి పంచాయతీకి కనీసం 10 వేల చొప్పున 49 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా.. వీటిల్లో ఇప్పటికే 50 లక్షల బ్యాగ్‌ల్లో విత్తనాలు నాటారు. ఈ ఏడాది టార్గెట్ పూర్తి చేసేందుకు నర్సరీల్లో మొక్కలు పెంచే క్రమంలో వివిధ కారణాలతో మొక్కల ఎండిపోవడం, చనిపోవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో లక్ష్యానికి మించి మొక్కలను పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు ఒక్కో మొక్కకు కనీసం రూ. 8నుంచి రూ.10 వరకు ఖర్చు చేయనున్నారు. ప్రతి ఇంటికి తులసి మొక్క పంపిణీ చేయనున్నారు. ఇళ్ల రహదారి ప్రాంతాల్లో నీడనిచ్చే, పూల, పండ్ల మొక్కలు నాటనున్నారు. అదేవిధంగా టేకు, ఈత, వెదురు, మలబారు, మునగ, వెలగ, మర్రి, వేప, బాదం, జామ, సీతాఫలం, ఖర్జూరా, మందార, సన్నజాజి, మల్లె తదితర మొక్కలకు ప్రాధాన్యమిస్తున్నారు.
మెళకువలు పాటిస్తూ..
నర్సరీల్లో మొక్కలు పెంచే క్రమంలో సరైన అవగాహన లేక చాలా చోట్ల మొలకలు రాక రెండో సారి విత్తనాలు నాటాల్సి వస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ దఫా అలా జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విత్తన శుద్ధి చేయడం, సంచుల్లో నాణ్యమైన మట్టి నింపడం, మొలకల రావడానికి అవసరమైన ఉష్ణోగ్రత కల్పించడం, వేసవిలో ఎండిపోకుండా తరుచూ నీటి తడులు ఇవ్వడం, గ్రీన్ నెట్‌లను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. జాగ్రత్తలపై జిల్లా అధికారులు ఎప్పటికప్పుడూ సూచనలు చేస్తున్నారు.
ఫ వన మహోత్సవానికి మొక్కలు
సిద్ధం చేస్తున్న అధికారులు
ఫ 475 గ్రామాల్లో
నర్సరీల ఏర్పాటు
ఫ ఈ ఏడాది 49 లక్షల
మొక్కలు నాటడమే లక్ష్యం
50 లక్షల బ్యాగుల్లో విత్తనాలు నాటాం
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ నర్సరీల్లో 55 లక్షలు మొక్కలు పెంచడమే లక్ష్యంగా నర్సరీలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే 50 లక్షల మట్టి బ్యాగుల్లో విత్తనాలు నాటాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది, కార్యదర్శులకు శిక్షణ, సలహాలు ఇస్తూ నర్సరీలు సిద్ధం చేస్తున్నాం. కనీసం ఒక గ్రామ నర్సరీకి 10 నుంచి 12వేల మొక్కలు పెంచాలని నిర్ణయించాం.
– అప్పారావు, డీఆర్‌డీఓ, సూర్యాపేట
పచ్చదనానికి ప్రణాళిక
పచ్చదనానికి ప్రణాళిక
పచ్చదనానికి ప్రణాళిక
Comments
Please login to add a commentAdd a comment