
యాదవులకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి
కోదాడ: యాదవ సామాజిక వర్గానికి రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మర్యాద సైదులుయాదవ్ కోరారు. ఆదివారం కోదాడలో నిర్వహించిన సంఘం నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 18 వరకు దురాజ్‌పల్లి, కోదాడలో జరిగే లింగమంతుల జాతరలో యాదవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఆయనను స్థానిక నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తూము వెంకన్న యాదవ్, కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు ఈదుల కృష్ణయ్యయాదవ్, కట్టెబోయిన శ్రీనివాస్, గుండెల సూర్యనారాయణ, పిన్నబోయిన శ్రీనివాస్, మాదాల ఉపేందర్, మొడెం సైదిబాబు, చిమట శ్రీనివాస్, రాముడు, శివకృష్ణ, గంధం ఉపేందర్, జంగాల కృష్ణయ్య, మోహన్‌రావు పాల్గొన్నారు.
గోదావరి జలాల నిలిపివేత
అర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు వస్తున్న గోదావరి జలాలు వారబందీ విధానంలో ఆదివారం నిలిపివేశారు. ఈ విధానంలో ఈనెల 1న జిల్లాకు గోదావరి జలాలను పునరుద్ధరించారు. వారం రోజులు పూర్తి కావడంతో నిలిపివేశారు. తిరిగి ఈనెల 15న మళ్లీ పునరుద్ధరించి ఈ నెల 22 వరకు వదలనున్నారు.
మట్టపల్లిలో విశేష పూజలు
మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆదివారం విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో విశేష పూజలు చేశారు. సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవారాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ గావించారు. అనంతరంశ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు.
గురుకుల విద్యార్థుల
క్షేత్ర సందర్శన
నడిగూడెం : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఆదివారం గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కేవీకేను సందర్శించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త బి.సౌమ్య కేవీకేలో సాగు చేస్తున్న వివిధ రకాల పంటల గురించి వివరించారు. అదేవిధంగా వర్మి కంపోస్టు, జీవన ఎరువుల తయారీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, వైస్ ప్రిన్సిపాల్ సునీత, ఉపాధ్యాయులు రవికృష్ణ, రజినీ, శైలజ, రాజ్యలక్ష్మి, భగీరథ, మంజుల, అనూష, కోటయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

యాదవులకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి

యాదవులకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి

యాదవులకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి
Comments
Please login to add a commentAdd a comment