
కృష్ణ హత్య కేసులో నిందితులను శిక్షించాలి
సూర్యాపేట: ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన వడ్లకొండ కృష్ణ (బంటి) హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ భద్రయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో కుల, మతాంతర ప్రేమ వివాహాల్లో పరువు హత్యను నివారించడం ఎలా అనే అంశంపై ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణ కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించాలన్నారు. కృష్ణ భార్య భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. క బహుజన మహాసభ రాష్ట్ర నాయకుడు నారబోయిన వెంకట్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండాది డేవిడ్‌కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు, సీపీఐ సీనియర్ నాయకులు దంతాల రాంబాబు, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కమిటీ సభ్యుడు పేర్ల నాగయ్య, సామాజిక అధ్యయన వేదిక కో కన్వీనర్ రేపాక లింగయ్య, సీయూసీ నాయకులు షేక్ కరీం, డీటీఎఫ్ నాయకులు ఎస్‌కె ఉమర్‌టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. వీరన్న, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు కునుకుంట్ల సైదులు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబోయిన కిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment