
పకడ్బందీగా ఇంటర్ ప్రాక్టికల్స్
సూర్యాపేటటౌన్: ఈ నెల 3వ తేదీ నుంచి జరుగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భానునాయక్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పలు కళాశాలల్లో నిర్వహించిన ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం జరిగిన పరీక్షలో 620 మంది విద్యార్థులకు గాను 594 మంది విద్యార్థులు హాజరు కాగా 26 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 272 మంది విద్యార్థులకు 229 మంది విద్యార్థులు హాజరు కాగా 43 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో జనరల్ విభాగంలో 394 మంది విద్యార్థులకు గాను 383 మంది విద్యార్థులు హాజరవ్వగా 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చెప్పారు. ఒకేషనల్ విభాగంలో 289 మంది విద్యార్థులకు 263 మంది విద్యార్థులు హాజరు కాగా 26 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పేర్కొన్నారు.
ఫ డీఐఈఓ భానునాయక్
Comments
Please login to add a commentAdd a comment