నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సోమవారం ముగియనుంది. 3వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం కాగా.. 7వ తేదీ వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎమ్మెల్సీ, యూటీఎఫ్, ఇతర సంఘాలు అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఈ నెల 7వ తేదీన నల్లగొండలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ సమర్పించారు. మిగతా వారు కూడా ఒక్కో సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మరి కొందరు సోమవారం భారీ ర్యాలీతో నామినేషన్లు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
భారీగా దాఖలు కానున్న నామినేషన్లు
సోమవారం నామినేషన్లు ఆఖరు తేదీ కావడంతో అభ్యర్థులు పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పీఆర్‌టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా ర్యాలీలు నిర్వహించి నామినేషన్‌ను సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఫ భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్
వేయనున్న పలువురు అభ్యర్థులు
Comments
Please login to add a commentAdd a comment