
పెద్దగట్టులో భక్తుల సందడి
చివ్వెంల(సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్దదైన శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందే భక్తుల రాక మొదలైంది. సోమవారం భక్తులు తరలివచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. వారం రోజుల ముందే భక్తులు వస్తుండటంతో అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏర్పాట్లును ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్, ఈఓ కుశలయ్య, డైరెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు.
స్పందించారు.. పనులు చేశారు
చివ్వెంల(సూర్యాపేట) : దురాజ్‌పల్లి పరిధిలోని శ్రీ లింగమంతుల స్వామి(పెద్దగట్టు) ఆలయం వద్ద అధికారులు కొన్ని పనులు చేపట్టారు. జాతర పనులు నత్తనడకన సాగుతున్న అంశంపై పెద్దగట్టుపై పట్టింపేది అనే శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికాలు స్పందించారు. చెరువు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లకు తలుపులు బిగించారు. ఆలయం వద్ద చలువ పందిళ్లు వేశారు. గుట్టకింద కోనేరును శుభ్రం చేశారు.
రైతు భరోసా రెండో విడత రూ.73.93 కోట్లు జమ
భానుపురి (సూర్యాపేట) : యాసంగి రైతు భరోసా రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. జనవరి 26న ఎంపిక చేసిన గ్రామాల్లో నిధులను విడుదల చేయగా.. ఈనెల 5వ తేదీన ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు ఎకరానికి రూ.6000 చొప్పున నిధులను వారి అకౌంట్లో జమ చేసింది. సోమవారం ఎకరా నుంచి రెండు ఎకరాల లోపు భూమి ఉన్న 1,11,752 మంది జిల్లాలోని రైతులకు రూ.73,93,34,053 లను విడుదల చేసింది. విడతల వారీగా జిల్లాలో సాగుకు యోగ్యంగా ఉన్న భూములన్నింటికీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనుంది.
నేడు సినీ స్వరాభిషేకం
సూర్యాపేటటౌన్ : ఈ నెల11న సాయంత్రం 5 గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాల భవన్‌లో సినీ గాయకులు ఘంటసాల, బాల సుబ్రహ్మణ్యం, నటులు ఎన్ టీఆర్, ఏఎన్‌ఆర్‌ల స్మారకార్థం సినీ స్వరాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రముఖ గాయకుడు, జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాన్ని సోమవారం బాల భవన్ లో ఆవిష్కరించి మాట్లాడారు. సూర్యాపేటలో కళల అభివృద్ధిలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు హమీద్ ఖాన్, బండారు వీరు నాయుడు, సత్యనారాయణ పాల్గొన్నారు.

పెద్దగట్టులో భక్తుల సందడి

పెద్దగట్టులో భక్తుల సందడి
Comments
Please login to add a commentAdd a comment