సూర్యాపేటటౌన్ : మండల, జిల్లా పరిషత్ ఓటరు జాబితాను సోమవారం విడుదల చేశారు. ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని.. అందుకు సంబంధించి ఓటరు జాబితా సిద్ధం చేసుకోవాలని ఆదేశించడంతో జెడ్పీ సీఈఓ అప్పారావు ఆధ్వర్యంలో జిల్లాలో 23 జెడ్పీటీసీ, 235 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటరు జాబితా తయారు చేశారు. సోమవారం ఆ జాబితాను జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై ఉంచారు. జిల్లాలో ప్రాదేశిక ఓటర్లు మొత్తం 6,96,329 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 3,54,748 మంది, పురుషులు 3,41,560 మంది, ఇతరులు 21 మంది ఉన్నారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలో ఉన్న అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను ఈ నెల 15న ప్రకటించనున్నారు.
జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శన
23 జెడ్పీటీసీ, 235 ఎంపీటీసీ స్థానాలు
Comments
Please login to add a commentAdd a comment