టీచర్‌ ఎమ్మెల్సీ పోటీలో కోటీశ్వరులు | - | Sakshi
Sakshi News home page

టీచర్‌ ఎమ్మెల్సీ పోటీలో కోటీశ్వరులు

Published Wed, Feb 12 2025 9:35 AM | Last Updated on Wed, Feb 12 2025 9:35 AM

టీచర్‌ ఎమ్మెల్సీ పోటీలో కోటీశ్వరులు

టీచర్‌ ఎమ్మెల్సీ పోటీలో కోటీశ్వరులు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో పలువురు కోటీశ్వరులు ఉన్నారు. ప్రధాన సంఘాలు, సంస్థలకు చెందిన వారిలో ఎక్కువ మందికి రూ.కోట్లలో ఆస్తులు ఉన్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇళ్లు, బంగారం, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఇలా వివిధ రూపాల్లో ఉన్న తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. వారికి బ్యాంకు, వ్యక్తిగత రుణాలు, ఇంటి రుణాలు కలుపుకొని పెద్దమొత్తంలో అప్పులు కూడా ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి అందరికంటే ఆస్తిపరుడు. ఆయన ఇచ్చిన అఫిడవిట్‌ ప్రకారం రూ.17.30 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రెండో స్థానంలో ప్రైవేటు విద్యా సంస్థ యజమాని సుందర్‌రాజు ఉన్నారు. ప్రధాన సంఘాల అభ్యర్థుల్లో టీచర్స్‌ జేఏసీ తరఫున పోటీచేస్తున్న, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి మాత్రం రూ.లక్షల్లోనే ఆస్తులు ఉండగా, అప్పులు కూడా ఉన్నాయి.

పలువురు అభ్యర్థులు తమ అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు, అప్పుల వివరాలివీ..

● స్వతంత్ర అభ్యర్థి కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, ఆయన భార్య పేరున ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం మొత్తంగా రూ.17.30 కోట్ల విలువైన భూములు, ఇళ్లు, బంగారం తదితర స్థిర, చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. వివిధ బ్యాంకులు, వ్యక్తిగత అప్పులు మొత్తంగా రూ. 3.27 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయన పేరుపై వాహనాలు ఏమీ లేవు.

● ప్రైవేటు విద్యా సంస్థల యజమాని ఎస్‌.సుందర్‌రాజు, ఆయన భార్య, పిల్లల పేరున మొత్తంగా రూ.16.44 కోట్ల ఆస్తులు ఉండగా, బ్యాంకులు, ఇతరత్రా రూ.2.30 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆస్తుల్లో ఆయన, ఆయన కుటుంబ సభ్యుల పేరున రూ. కోటి విలువైన 33 ఎకరాల భూమి ఉంది. ఆయన పేరున మోటారు సైకిల్‌ మాత్రమే ఉంది.

● ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఆయన భార్య పేరున మొత్తంగా ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.5.05 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ.2.99 లక్షల అప్పు ఉంది. ఆస్తుల్లో రూ.90.10 లక్షల విలువైన బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఎల్‌ఐసీలు, బంగారం ఉంది. మాడుగులపల్లి మండలం భీమనపల్లిలో ప్రస్తుతం రూ.1.20 కోట్ల విలువైన 4.30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మిర్యాలగూడలో ప్లాట్లు ఉన్నాయి.

● డాక్టర్‌ కొలిపాక వెంకటస్వామి, ఆయన భార్య పేరున అన్నీ కలిపి రూ. 3.20 కోట్ల ఆస్తులు ఉండగా, రూ.కోటిన్నర అప్పు ఉంది.

● ప్రొఫెసర్‌ తాటికొండ వెంకటరాజయ్య, ఆయన భార్య పేరున రూ. 3.06 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

● పీఆర్‌టీయూ(టీఎస్‌) అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, ఆయన భార్య, పిల్లల పేరున మొత్తంగా రూ.2.29 కోట్లు విలువైన ఆస్తులు ఉండగా, ఇక రూ.1.36 కోట్ల అప్పులు ఉన్నాయి.

● బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి పేరున రూ.1.32 కోట్ల ఆస్తులు ఉండగా, రూ. 21.80 లక్షల అప్పులు ఉన్నాయి. ఆయన పేరున ఎలాంటి వాహనాలూ లేవు.

● స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్‌, ఆయన భార్య పేరున రూ.1.28 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, అందులో రూ.98 లక్షల విలువైన 21 ఎకరాల భూమి ఉంది. ఆయన పేరున మోటారు సైకిల్‌ మాత్రమే ఉంది.

● టీచర్స్‌ జేఏసీ అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, ఆయన భార్య, పిల్లల పేరున రూ.77 లక్షల ఆస్తులు ఉండగా, రూ. 57 లక్షల అప్పులు ఉన్నాయి.

● ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల పేరున రూ. 1.88 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ.28 లక్షల అప్పులు ఉన్నాయి.

● స్వతంత్ర అభ్యర్థి బంక రాజు పేరున రూ.1.10 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ. 13.74 లక్షల అప్పులు ఉన్నాయి.

● స్వతంత్ర అభ్యర్థి అర్వ స్వాతి, కుటుంబ సభ్యుల పేరున రూ.1.29 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ.40 లక్షల అప్పులు ఉన్నాయి.

● స్వతంత్ర అభ్యర్థి.. కంటె సాయన్న, ఆయన కుటుంబ సభ్యుల పేరున రూ. 3 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

ఫ అందరిలో ఆస్తిపరుడు కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి

ఫ నామినేషన్‌ వేసిన వారిలో ఆయనకే అత్యధిక ఆస్తులు

ఫ రూ.17.30 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడి

ఫ ఆ తరువాత అత్యధికంగా సుందర్‌రాజుకు రూ.16.44 కోట్ల విలువైన ఆస్తులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement