
ఒక నామినేషన్ తిరస్కరణ
ఫ సంతకం పెట్టకుండా సమర్పించడంతో తిరస్కరించిన ఎన్నికల అధికారులు
నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సమర్పించిన నామినేషన్లలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా.. మొత్తం 23 మంది నామినేషన్లు సమర్పించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం (స్క్రూట్నీ) నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి తండు ఉపేందర్ నామినేషన్ పత్రంపై సంతకం పెట్టకుండా సమర్పించడంతో తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మిగిలిన 22 మంది నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో వాటిని ఆమోదించినట్లు పేర్కొన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శిగా రమాదేవి
నేరేడుచర్ల : మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేరేడుచర్లకు చెందిన నక్క రమాదేవిని నియమించారు. ఈమేరకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునితరావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ చేతుల మీదుగా మంగళవారం హైదరాబాద్‌లో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో పాటు మహిళా సంఘాన్ని కూడా బలోపేతం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర భారీనీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి, నేరేడుచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన వెంకకట్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నూకల సందీఫ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ తాళ్ల సురేష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బచ్చలకూరి ప్రకాశ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అలక సరిత తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
ద్వారా శిక్షించాలి
సూర్యాపేటటౌన్ : వడ్లకొండ కృష్ణ ఆలియాస్ మాల బంటిని కుల దురహంకారంతో హత్య చేసిన నిందితులను, సహకరించిన వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో–కన్వీనర్ కె.శ్రీదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కులదురహంకార హత్యకు గురైన వడ్లకొండ కృష్ణ కుటుంబాన్ని చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకొని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చి మాట్లాడారు. ఈ హత్యకు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాదని మొత్తం ఈ భావజాలాన్ని పెంచి పోషిస్తున్నది కుల పెద్దలేనని, కుల దురహంకారాన్ని రెచ్చగొట్టే సంస్కృతిని విడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం హైదరాబాద్ కమిటీ కో–కన్వీనర్ సత్య, సభ్యులు సబిత, తిరుమ్ల, సావిత్రి, కిరణ్మయి, అరుణజ్యోతి, చింత పద్మలతో పాటు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసేన్, సుధాకర్‌రెడ్డి, ఏడిండ్ల అశోక్ ఉన్నారు.
హనుమంతుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజ విశేషంగా నిర్వహించారు. హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతోపాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించారు. సాయంత్రం వెండి జోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి.

ఒక నామినేషన్ తిరస్కరణ
Comments
Please login to add a commentAdd a comment