బర్డ్‌ఫ్లూపై అలర్ట్
చకచకా పెద్దగట్టు పనులు
లింగమంతులస్వామి(పెద్దగట్టు) జాతరకు సంబంధించిన పనులు చకచకా కొనసాగుతున్నాయి.
బుధవారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
- 8లో
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. పలు జిల్లాల్లో కొద్ది రోజులుగా బాయిలర్ కోళ్లు చనిపోతున్న సంఘటనలతో రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో జిల్లాలోకి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన బాయిలర్ కోళ్లు రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆంధ్రా నుంచి జిల్లాలోకి కోళ్లను రవాణా చేయకుండా ఉండేందుకు చెక్‌పోస్టును సైతం ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర ఉన్నతాధికారుల సూచనలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి జిల్లాలోని ఫౌల్ట్రీ ఫాంలలో ఏమైనా వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా..? లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు శాంపిళ్లను సేకరిస్తున్నారు.
ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు..
జిల్లాలో ఎక్కడైనా కోళ్లకు బర్డ్‌ఫ్లూ ప్రబలినట్లు సమాచారం అందితే .. వెంటనే అక్కడికి వెళ్లి చికిత్స అందించడానికి జిల్లాస్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను జిల్లా పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసింది. ఈ టీంలో పశు వైద్యుడితో పాటు ఇద్దరు పారా వెటర్నరీలు, ఇద్దరు సహాయకులు ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ వ్యాధితో కోళ్లు చనిపోయిన దాఖలాలు లేకపోగా.. ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
న్యూస్‌రీల్
ఫ జిల్లాలోని కోళ్లలో కనిపించని వ్యాధి లక్షణాలు
ఫ ముందు జాగ్రత్తగా పౌల్ట్రీఫాంల పరిశీలనకు బృందాలు
ఫ కోదాడ సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు.. ఆంధ్రా నుంచి కోళ్లు రాకుండా అడ్డగింత
Comments
Please login to add a commentAdd a comment