సొంత నిర్ణయాలు అమలు చేయొద్దు
భానుపురి (సూర్యాపేట) : ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలు అమలు చేయవద్దని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఆర్‌ఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలకు నామినేషన్, స్క్రూట్నీ, ఉపసంహరణ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఆర్‌ఓలకు సంబంధించిన విధుల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో కలెక్టర్ మాట్లాడారు. చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ఎన్నికల నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. రిటర్నింగ్ అధికారులు తప్పక కరదీపికను పూర్తిగా చదవాలని, అప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమర్థంగా విధులు నిర్వహించగలుగుతారని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూట్నీ, ఉపసంహరణ ప్రక్రియలను ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు తమ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో సమయపాలన పక్కాగా పాటించాలన్నారు. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాలని, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు వారికి కేటాయించిన గుర్తులతో పాటు శ్రీనోట్ఙా సింబల్ కూడా తప్పనిసరిగా చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, జెడ్పీ సీఈఓ వివి అప్పారావు, స్పెషల్ అధికారులు పాల్గొన్నారు.
వివరాల నమోదులో తప్పులు జరగొద్దు
విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ కు సంబంధించి సీఆర్‌పీలు, యంఐయస్ కో ఆర్డినేటర్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌లకు నిర్వహించిన వర్క్ షాప్‌లో కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆశోక్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment