
అర్చకుడిపై దాడిచేసిన వారిని శిక్షించాలి
సూర్యాపేట : చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుడు ఎంవీ రంగరాజన్‌పై దాడిని వారిపై చర్యలు తీసుకోవాలని అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు డిమాండ్ చేశారు. అర్చకుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెలంగాణ అర్చక సమాఖ్య, దేవాలయాల ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హిందూ ధర్మపరిరక్షకులైన అర్చకులపైన, సనాతన ధర్మం పై జరుగుతున్న దాడిని యావత్ హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అర్చకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వీర రాఘవరెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. అర్చకులకు, ఆలయాలకు భద్రత కల్పించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు వలివేటి వీరభద్ర శర్మ, వైష్ణవ సంఘం జిల్లా నాయకుడు దరూరి రామానూజా చార్యులు, బ్రాహ్మణ సమాజం అధ్యక్షుడు చకిలం రాజేశ్వర్ రావు, హిందూ ఐక్య వేదిక కన్వీనర్లు పర్వతం శ్రీధర్, నాగవెల్లి ప్రభాకర్, గట్ల సోమయ్య, అర్చక స్వాములు, వీరభద్రశర్మ, రెంటాల సతీష్, భట్టారం వంశీ కృష్ణ, శ్రీధరా చార్యులు, సంకర్శణాచార్యులు, శ్రీహరి ఆచార్యులు, సాగర శర్మ, మరింగంటి శ్రీనివాసా చార్యులు, వికాస తరంగిణి, ఆండాళ్ గొష్టి మహిళా భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment