
పనులు త్వరగా పూర్తి చేయాలి
చివ్వెంల(సూర్యాపేట) : శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బోళ్ల శ్రీనివాస్ కోరారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులోగల శ్రీ లింగమంతుల స్వామి ఆలయ పరిసరాల్లో రూ.1.67 కోట్ల వ్యయంతో చేస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా జంగిల్ క్లియరెన్స్, బారికేడ్లు, లైటింగ్, మరుగుదొడ్ల మరమ్మతులు, కోనేరు పనులు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు, రోడ్లపై గుంతలు పూడ్చడం వంటి పనులను పరిశీలించి మాట్లాడారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. మరుగుదొడ్లు, నీటి ట్యాంకుల వద్ద నీరు రోడ్లపైకి రాకుండా ఎత్తుగా నిర్మించాలన్నారు. మురుగు నీరు బయటకు వెళ్లడానికి పైపులైన్లు వేయాలన్నారు. పనులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇంజనీర్లను ఆదేశించారు. గుట్టచుట్టూ పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ ఈఈ యం.కిరణ్‌రావు, డీఈ సత్యారావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఏఈ తిరుమలయ్య, రాజిరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ యం.డీ. గౌసొద్దీన్, ఎం.ఎస్.ఆర్, ప్రసాద్, మనోజ్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ సురేష్, శివప్రసాద్ పాల్గొన్నారు.
ఫ మున్సిపల్ కమిషనర్ బోళ్ల శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment