
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
భానుపురి (సూర్యాపేట) : సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో పోస్టర్‌ను అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలతో ఎవరికై నా సమస్య ఏర్పడితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీనివాస రాజు, పద్మారావు, యల్‌డీయం బాపూజీ, ఈడీఎం గఫార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment