
అభివృద్ధి పనుల నిర్వహణలో అలసత్వం వద్దు
చివ్వెంల(సూర్యాపేట) : శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ హెచ్చరించారు. మంగళవారం దురాజ్‌పల్లి గ్రామ పరిధిలోని పెద్దగట్టు ఆలయం వద్ద మరుగుదొడ్లు, చలువ పందిళ్లు, బారికేడ్లు, సీసీకెమెరాల ఏర్పాటు పనులను పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 20 వరకు జరగనున్న జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ కుశలయ్య, పెద్దగట్టు చైర్మన్ నర్సయ్య యాదవ్, ఆలయ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment