
బడి బయట పిల్లలు 228 మంది
నాగారం : పాఠశాలకు వెళ్లని, బడి మధ్యలోనే మానేసిన పిల్లలు జిల్లాలో 228 మంది ఉన్నట్లు తేలింది. వివిధ కారణాలతో చదువుకు దూరమైన వీరిని బడుల్లో చేర్పించనున్నారు. గతనెల 12 నుంచి 31 వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఆర్పీలు క్షేత్రస్థాయిలో బడి బయట పిల్లల గుర్తింపు కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలకు వెళ్లని పిల్లల వివరాలు సేకరించి, కారణాలు అడిగి తెలు సుకున్నారు. వీరందరినీ సమీప పాఠశాలల్లో చేర్చించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇ టుక బట్టీల్లోని కార్మికుల పిల్లల కోసం సైతం విద్యాశాఖ ప్రత్యేక బడులు ఏర్పాటు చేస్తోంది. బట్టీల యజమానుల సహకారంతో పుస్తకాలు తదితర సామగ్రి పంపిణీ చేస్తూ పాఠాలు బోధిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదు
సీఆర్పీలు పాఠశాలల్లోని విలేజ్ లెవల్ రిజిష్ట్టర్ ఆధారంగా బడీడు పిల్లల ఇళ్లకు వెళ్లి, 6–14 ఏళ్లు, 15 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న వారి వివరాలను ఆరా తీశారు. మధ్యలో బడి మానేశారా? ఆర్థిక ఇబ్బందులున్నాయా? పనులకు వెళ్తున్నారా? అనే కోణంలో వివరాలు సేకరించారు. 228 మంది పాఠశాలకు వెళ్లని పిల్లలను గుర్తించారు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహకరించడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం తదితర కారణాలతో బడికి వెళ్లని వారే అధికంగా ఉన్నారు. వీరి వివరాలు ప్రబంధ్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు.
బడి బయట ఉన్న పిల్లల ఇళ్లకు వెళ్లి..
విద్యాశాఖ చట్టం ప్రకారం బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి. అయితే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చాలా మంది పేదరికంతో విద్యకు దూరమవుతున్నారు. చదువుకోవాలని ఉన్నా పాఠశాలకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. బడి బయట ఉన్న పిల్లల ఇళ్లకు వెళ్లి వాస్తవ పరిస్థితులు సీఆర్పీలు తెలుసుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని పాఠశాలల్లో చేర్చించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనాథ పిల్లలను కస్తూర్బా, గురుకులాల్లో చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
77 మంది సీఆర్పీలు
జిల్లాలోని 23 మండలాలలో 64 క్లస్టర్లు ఉండగా వీటి పరిధిలో 77 మంది సీఆర్పీలు పనిస్తున్నారు. వీరందరూ క్షేత్రస్థాయిలో బడి బయట పిల్లల సర్వే చేపట్టారు. జిల్లాలో 6 నుంచి 14 ఏళ్ల వారు 125 మంది, 15 నుంచి 19 ఏళ్ల వారు 28 మంది, వలస వచ్చిన వారు 41, వలస వెళ్లిన వారు 30, దివ్యాంగులు నలుగురు.. ఇలా జిల్లా వ్యాప్తంగా బడి బయట పిల్లలు 228 మందిని గుర్తించారు.
ప్రతి ఒక్కరికీ విద్య అందించేలా చర్యలు
జిల్లాలో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాం. తల్లిదండ్రుల సహకారంతో వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తున్నాం. వలస కార్మికుల పిల్లలకు స్థానికంగా విద్యనందించే ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరికీ విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– దేవరశెట్టి జనార్దన్, కోఆర్టినేటర్ ఫర్ అవుటాఫ్ స్కూల్ చిల్డ్రన్, సూర్యాపేట
వలస కార్మికుల పిల్లలకు బడులు ఏర్పాటు
బడి బయట పిల్లలను గుర్తించేందుకు మొదటగా క్లస్టర్ పరిధిలో పనిచేస్తున్న సీఆర్పీలు మండలాల్లోని గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. జిల్లాలోని ఇటుకబట్టీల్లో 41 మంది బడీడు పిల్లలను గుర్తించారు. వీరికోసం స్థానికంగానే ప్రత్యేక బడులు ఏర్పాటు చేశారు. విద్యార్హతలు ఉన్న వారిని గుర్తించి వారిని వలంటీర్లుగా నియమించి బోధన చేయిస్తున్నారు. అలాగే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పలకలు తదితర సామగ్రిని బట్టీల నిర్వాహకులు, అధికారులు సమకూర్చుతున్నారు.
ఫ గత నెలలో నిర్వహించిన సర్వేలో గుర్తించిన సీఆర్పీలు
ఫ వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు
ఫ పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు
గతేడాది గుర్తించిన
బడి బయట పిల్లల
సంఖ్య 145
ఈ ఏడాది
గుర్తించిన పిల్లలు
228
ప్రభుత్వ
పాఠశాలలు
967
పాఠశాల
కాంప్లెక్స్‌లు
64
సర్వేలో పాల్గొన్న సీఆర్పీలు
77

బడి బయట పిల్లలు 228 మంది
Comments
Please login to add a commentAdd a comment