
ఇక నుంచి మీ సేవలోనే
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణకు మరో అవకాశం
తిరుమలగిరి (తుంగతుర్తి): రేషన్ కార్డుల కోసం కొత్తగా దరఖాస్తులు స్వీకరించడానికి పౌర సరఫరాల శాఖ మరో అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇక నుంచి మీ సేవ వెబ్‌సైట్‌లో దరఖాస్తుల స్వీకరిస్తారు. దీంట్లో భాగంగా దరఖాస్తుల స్వీకరణకు అధికారులు వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ను పునఃరుద్ధరించారు. దీంతో ఐదు రోజులుగా దరఖాస్తుల స్వీకరణపై నెలకొన్న గందరగోళానికి తెరపడడంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం సాయంత్రం నుంచి మొదలైంది. అయితే రేషన్ కార్డుల కోసం ప్రజా పాలన కార్యక్రమం, కుల గణన లేదా ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు పెట్టుకునే అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కొత్త కార్డు, చిరునామా మార్పు, కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చడం వంటి వాటికి అవకాశం కల్పించారు. అయితే ఆధార్ కార్డు ద్వారా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
గతంలో దరఖాస్తు చేసుకోని వారికి..
ప్రజా పాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభలు నిర్వహించింది. వివిధ గ్రామాల్లో అధికారులు వెల్లడించిన జాబితాపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. జాబితాలో పేర్లు రాని వారు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారికి మళ్లీ దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఇచ్చారు.
ఫ పౌర సరఫరాల శాఖ నిర్ణయం
ఫ కొనసాగుతున్న ఆన్‌లైన్ ప్రక్రియ
ఫ ఇప్పటి వరకు చేసుకోని వారికి చాన్స్
నిరీక్షణకు తెరపడేనా?
తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం లక్షలాది మంది నిరీక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో వేగం పుంజుకుంది. దీంతో పేదలలో ఆశలు చిగురించాయి. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను అధికారులు అందించారు. వీటి ఆధారంగా అర్హుల జాబితాను అధికారులు రూపొందించి గ్రామ సభల్లో పెట్టారు. స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హులు ఎవరని తేల్చనున్నారు.
రేషన్ కార్డుల కోసం
వచ్చిన దరఖాస్తులు
ప్రజా పాలనలో
28,000
గ్రామ సభల్లో
23,798
మొత్తం
51,798
Comments
Please login to add a commentAdd a comment