
ఉపసంహరణకు నేడు ఆఖరు
నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 13న గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. మొత్తం 23 మంది నామినేషన్లు సమర్పించగా ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. 22 మంది అభ్యర్థు ల నామినేషన్లను ఆమోదించారు. గురువా రం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటించనున్నారు.
ఎంజీయూ అడిషనల్ కంట్రోలర్‌గా రామచందర్
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో అసిస్టెంట్ కంట్రోలర్‌గా డాక్టర్ ఎం.రామచందర్‌గౌడ్, కాంపిటీటివ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్‌గా సోషల్ వర్క్ విభాగ అధిపతి డాక్టర్ ఎస్.శ్రవణ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఒక ఏడాది పాటు ఆ బాధ్యతల్లో కొనసాగుతారు.
విద్యారంగాన్ని పట్టించుకోని ప్రభుత్వం
భానుపురి (సూర్యాపేట): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్ విమర్శించారు. బుధవారం సూర్యాపేటలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో విద్యారంగం పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్.. విద్యాసంస్థల నిర్వహణకు, ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోని స్థితి ఉందన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మాతంగి విజయ్, వంటికొమ్ము నగేష్, సాయి కిరణ్, నితిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
రామగిరి(నల్లగొండ): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, కోఆర్డినేటర్ డాక్టర్ వెల్దండి శ్రీధర్ తెలిపారు. పీజీ, యూజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులతో కలిసి 72 కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఠీఠీఠీ.ౌ ఠఛిఛ్ఛీ. ుఽ్ఛ్ట వెబ్‌సైట్ నందు వివరాలు పొందుపర్చినట్లు చెప్పారు. మార్చి 31వ తేదీలోపు ఆన్‌లైన్ నందు ఫీజు చెల్లించి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 98669 77741, 93986 73736ను సంప్రదించాలని పేర్కొన్నారు.
‘స్థానిక’ పోరులో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం
చిలుకూరు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం చిలుకూరు మండల కేంద్రంలోని సీపీఐ భవన్‌లో జరిగిన పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా వచ్చినా కాంగ్రెస్‌తోనే పొత్తుకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. మండల స్థాయిలో గతంలో మాదిరిగా జెడ్పీటీసీ స్థానాన్ని సీపీఐకు కేటాయించాలని కోరారు. అలా కాకుంటే ఎంపీపీ, జెడ్పీటీసీలలో ఏ ఒక్కటి ఇచ్చినా తీసుకుంటామన్నారు. అలాగే సర్పంచ్ స్థానాల్లో సీపీఐకి మండల కేంద్రం చిలుకూరుతోపాటు నారాయణపురం, జెర్రిపోతులగూడెం, కొమ్ముబండతండా, సీతారాంపురం గ్రామాలు, అలాగే ఎంపీటీసీ స్థానాలు చిలుకూరులో రెండు, జెర్రిపోతులగూడెం, నారాయణపురం, బేతవోలులో ఒకటి చొప్పున అయిదు స్థానాలు సీపీఐకు కేటాయించాలని అన్నారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ కార్యదర్శులు సాహెబ్ అలీ, చిలువేరు ఆంజనేయులు, నాయకులు చేపూరి కొండలు, కొడారు శ్రీను, కనకయ్య, నాగేశ్వరరావు, సుల్తాన్ వెంకటేశ్వర్లు, కట్టెకోల నాగేశ్వరరావు, మాధవరపు లక్ష్మయ్య పాల్గొన్నారు.

ఉపసంహరణకు నేడు ఆఖరు
Comments
Please login to add a commentAdd a comment