
కనుల పండువగా ఎదుర్కోలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టువస్త్రాలు, తలంబ్రాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సామ అభిషేక్‌రెడ్డి, దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ ఇందుర్తి వెంకట్‌రెడ్డి తలపై పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.5కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, గుడిపెల్లి మధుకర్‌రెడ్డి, బీరవోలు విక్రమ్‌రెడ్డి, సుంకరి జనార్దన్, వేల్పుల రమేష్, బైరబోయిన మహరాజు, సైదులు, రామలింగయ్య, కనుకు శ్రీను, మాజీ జెడ్పీటీసీ అవిలయ్య, దాసరి సోమయ్య, ఈఓ శ్రీనివాస్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసమూర్తి, ధర్మకర్తలు అనిల్, కృష్ణమూర్తి, ప్రవీణ్, రేఖ, వెంకన్న, వెంకట్‌రెడ్డి, నిమ్మల కుమార్, నిద్ర సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కొనసాగుతున్న శ్రీయోగానంద
లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

కనుల పండువగా ఎదుర్కోలు
Comments
Please login to add a commentAdd a comment