
వైభవంగా సుదర్శన హోమం
చివ్వెంల: మండలంలోని ఉండ్రుగొండ గ్రామ శివారులో గల గిరిదుర్గంలో వెలిసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మాఘ పౌర్ణిమ సందర్భంగా బుధవారం శ్రీసుదర్శన లక్ష్మీనరసింహ హోమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆరుట్ల రవికుమారాచార్యులు, కృష్ణమాచార్యుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమంలో 15 మంది దంపతులు కూర్చున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చకిలం కృష్ణకుమార్, డాక్టర్ ఎ.రామయ్య, మురళీకృష్ణ, బందకవి కృష్ణమోహన్, బొబ్బిలి శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్ కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
యుద్ధభేరి ధర్నాను జయప్రదం చేయాలి
సూర్యాపేట టౌన్: కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీంను నిరసిస్తూ మార్చి 2న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిర్వహించనున్న యుద్ధభేరి ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ ధర్నాకు జిల్లా నుంచి సీపీఎస్ ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment