
గతంలో చేయనివారే దరఖాస్తు చేసుకోవాలి
తిరుమలగిరి, అర్వపల్లి: కొత్త రేషన్‌కార్డులకు గతంలో చేయనివారు మాత్రమే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని మీసేవ కేంద్రాల జిల్లా మేనేజర్ (ఈడీఎం) గఫార్ కోరారు. తిరుమలగిరి, అర్వపల్లిలోని మీసేవ కేంద్రాలను బుధవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. కొత్త రేషన్‌కార్డుకు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు మాత్రమే మీసేవ కేంద్రాల్లో చేయాలని, అలాగే కార్డు ఉండి కుటుంబ సభ్యులందరి పేర్లు లేనివారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరను మాత్రమే తీసుకోవాలని, అదనంగా వసూళ్లు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మీసేవ కేంద్రాల యజమానులు గన్నె సత్యనారాయణ, దావుల మల్లిఖార్జున్, సైదులు, వెంకన్న, సాయి, జ్యోతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment