
ఎస్పీని అభినందించిన డీజీపీ
సూర్యాపేట టౌన్: కరీంనగర్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో టేబుల్ టెన్నిస్ విభాగంలో జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ పాల్గొని బ్రాంజ్ మెడల్ గెలుపొందారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ బుధవారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మెడల్, ప్రశంసా పత్రం అందించి అభినందించారు. అలాగే ఇదే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో 5వ జోన్ తరఫున జిల్లా నుంచి పాల్గొని కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకాలు పొందిన మహిళా జట్ల క్రీడాకారులను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment