ఖండాంతరాలు దాటిన ప్రేమ
ఫ ప్రేమించుకున్నారు.. పెళ్లితో ఒక్కటయ్యారు
ఫ ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు
ఫ నేడు ప్రేమికుల దినోత్సవం
చిట్యాల: చిట్యాల మండలానికి చెందిన ఇద్దరు అబ్బాయిలు విదేశీ అమ్మాయిలను పెళ్లి చేసుకుని తమ ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన కందిమళ్ల మహేందర్‌రెడ్డి–ప్రేమలత దంపతుల కుమారుడు రాజీవ్‌రెడ్డి.. యూకేలోని మాంచెస్టర్‌కు చెందిన కే.ఫిషర్–డేవ్ ఫిషర్ దంపతుల కూతురు లారెన్ ఫిషర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాజీవ్‌రెడ్డి యూకేలోని మాంచెస్టర్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సును చదువుకునేందుకు వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే పోలీస్‌శాఖలో (సైకాలజీ విభాగం) పనిచేస్తున్న లారెన్ ఫిషర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమ మొదలయ్యింది. దీంతో వారిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఇటీవల హైదరాబాద్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. అలాగే గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన సీమ సాలయ్య–యాదమ్మల కుమారుడు నాగరాజు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే సంస్థలో ఇండోనేషియాలో పనిచేస్తున్న ఆ దేశానికి చెందిన యువతి రిజ్కినన్ డానఫిట్రి పనిచేస్తుంది. వీరికి మొదట్లో మొబైల్ కాల్‌తో పరిచయమైంది. అనంతరం ఆ యువతి ఉద్యోగ నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌కు రావడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలను ఒప్పించి గత నెలలో గుండ్రాంపల్లి గ్రామంలో పెళ్లి చేసుకున్నారు.
ఇక్కడబ్బాయిలు.. విదేశీ అమ్మాయిలు
ఖండాంతరాలు దాటిన ప్రేమ
ఖండాంతరాలు దాటిన ప్రేమ
ఖండాంతరాలు దాటిన ప్రేమ
ఖండాంతరాలు దాటిన ప్రేమ
Comments
Please login to add a commentAdd a comment