ఆపరేషన్లు చేయిస్తూ.. ఆరోగ్యం తెలుసుకుంటూ
మునుగోడు: మునుగోడు నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కంటి ఆపరేషన్లు చేయిస్తూ అందరి మన్నలు పొందుతున్నారు. తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరిలో ఒకసారి, ఈ నెల 9వ తేదీన మరోసారి మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దాదాపు 1350 మంది కంటి పరీక్షలు చేయించుకోగా అందులో 650 మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఎమ్మెల్యే ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసి హైదరాబాద్‌లోని శంకర్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఇప్పటి వరకు 520 మందికి దగ్గర ఉండి కంటి ఆపరేషన్లు చేయించారు. ఆపరేషన్లు చేయించుకున్న వారి వద్దకు ఎమ్మెల్యే వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లోనే గ్రామాలకు తీసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నెలలో రెండుసార్లు కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
మునుగోడు నియోజకవర్గ ప్రజలకు
అండగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment