ఎంజీయూ ఇండస్ట్రీ ఇనిస్టిట్యూషన్ డైరెక్టర్‌గా సురేష్‌ర
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇనిస్టిట్యూషన్ సెంటర్ డైరెక్టర్‌గా జక్కా సురేష్‌రెడ్డిని నియమిస్తూ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం వీసీ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి చేతుల మీదుగా సురేష్‌రెడ్డి నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. పరిశ్రమలు, యూనివర్సిటీని అనుసంధానం చేస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కోరారు. పోటీ ప్రపంచంలో కంపెనీల అవసరాలకు తగిన నైపుణ్యాలను పెంపొందించాలంటే పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment