గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మీదుగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందితో కలిసి భద్రాచలంలోని ఆర్టీఏ కార్యాలయం వద్ద తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారని చెప్పారు. వీరిని అదుపులోకి తీసుకోగా రూ.3లక్షల విలువైన 2.080 కేజీల గంజాయి లభించిందని, నిందితులు నల్లగొండకు చెందిన ముంత నవీన్, నగరికంటి సుభాష్‌గా తేలిందని వెల్లడించారు. వీరిద్దరు ఒడిశా నుంచి నల్లగొండకు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. నిందితులు, గంజాయి, ద్విచక్ర వాహనాన్ని భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్ అధికారులకు అప్పగించామని పేర్కొన్నారు. తనిఖీల్లో సిబ్బంది బాలు, సుధీర్, హరీష్, వెంకట్, హనుమంతరావు, ఉపేందర్ పాల్గొన్నారు.
వృద్ధురాలి మెడలో
పుస్తెలతాడు అపహరణ
పెన్‌పహాడ్: వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దోసపహాడ్ గ్రామానికి చెందిన కీత పిచ్చమ్మ తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా.. సాగర్ ఎడమ కాల్వ కట్టపై బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను మాటల్లో పెట్టి మెడలోని పుస్తెలతాడు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పని ప్రదేశంలో
ఉపాధి హామీ కూలీ మృతి
రామన్నపేట: పని ప్రదేశంలో గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతిచెందింది. ఈ ఘటన రామన్నపేట మండల కేంద్రంలో గురువారం జరిగింది. రామన్నపేట మండల కేంద్రానికి చెందిన శ్యామల లింగమ్మ(55) గురువారం అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఉపాధి హామీ పథకంలో కింద పనిచేసేందుకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా పని ప్రదేశంలో కిందపడిపోయింది. సహచర కూలీలు గమనించి స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్‌కు విషయం తెలిపారు. 108 వాహనంలో రామన్నపేట ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
128 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నల్లగొండ: అక్రమంగా నిల్వ ఉంచిన 128 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ నాగరాజు గురువారం పేర్కొన్నారు. నల్లగొండలోని పానగల్ వడ్డెరవాడకు చెందిన కర్ర రమేష్ చుట్టుపక్కల గ్రామాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసి తన ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేసి రమేష్ ఇంట్లో 11 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. అదేవిధంగా శ్రీరాంనగర్‌లోని డాన్ స్కూల్ సమీపంలో సాయి ఆంజనేయ రైస్ మిల్లులో నిల్వ ఉంచిన 117 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment