విదేశీ, స్వదేశీ సంప్రదాయంలో పెళ్లి..
మోత్కూరు: ఖండాంతరాలు దాటిన ప్రేమ మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన జినుకల లలిత, ధర్మయ్య దంపతుల ప్రథమ కుమారుడు సందీప్‌కుమార్‌తో అమెరికాకు చెందిన మరియడిలారోసా ఆర్మాండోహెర్నాండెజ్ దంపతుల చిన్న కూతురు ఎలేనా (అవని)తో ఏడాది క్రితం అమెరికాలో వివాహం జరిగింది. సందీప్‌కుమార్ పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి మాస్టర్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అనంతరం టెక్సాస్ రాష్ట్రంలో ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఎంబీఏ పూర్తి చేసిన ఎలేనా అదే కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి కుటుంబాల తల్లిదండ్రులు అంగీకరించడంతో ఏడాది క్రితం అమెరికా సంప్రదాయం ప్రకారం అక్కడ వీరు ఇరువురు పెళ్లి చేసుకొని దంపతులయ్యారు. సందీప్‌కుమార్ తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ నెల 7న ఘట్కేసర్‌లోని రాక్‌ఎన్‌క్లేవ్ ఫంక్షన్ హాల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం సందీప్‌కుమార్, ఎలేనా మరోసారి పెళ్లి చేసుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆశీర్వాదం పొందారు.
Comments
Please login to add a commentAdd a comment