రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు ప్రాజెక్టుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు ప్రాజెక్టుల ఎంపిక

Published Fri, Feb 14 2025 10:23 PM | Last Updated on Fri, Feb 14 2025 10:23 PM

-

రామగిరి(నల్లగొండ): డిగ్రీ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రతి ఏటా రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలను నిర్వహిస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు కొన్ని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి.

● నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుంచి హిస్టరీ సబ్జెక్టులో హిస్టారికల్‌ ప్లేసెస్‌ ఇన్‌ నల్లగొండ టౌన్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులో అగ్రికల్చర వీడర్‌

● నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల నుంచి బోటనీ సబ్జెక్టు నుంచి ఏ కంపారిటీవ్‌ స్టడీ ఆన్‌ ది ఇంపాక్ట్‌ ఆఫ్‌ ఆర్డానిక్‌ అండ్‌ కెమికల్‌ ఫెర్టిలైజర్స్‌ ఆన్‌ ది న్యూట్రిషినల్‌ కంపోజిషన్‌ ఆఫ్‌ సెలక్టెడ్‌ వెజిటేబుల్స్‌, కామర్స్‌ సబ్జెక్టులో ఎక్సోఫ్లోరింగ్‌ టూరిజమ్‌ పోటెన్షియల్‌ ఇన్‌ నల్లగొండ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ ఏ కంప్రహెన్సివ్‌ స్టడీ ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.

● మిర్యాలగూడలోని కేఎన్‌ఎం డిగ్రీ కళాశాల నుంచి మాథ్స్‌ సబ్జెక్టులో ది రోల్‌ ఆఫ్‌ మేథమెటిక్స్‌ ఇన్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌,

● దేవరకొండలోని ఎంకేఆర్‌ కళాశాల నుంచి మాథ్స్‌ సబ్జెకులో ఎసెన్షియల్‌ మాథమెటిక్స ఫర్‌ ఇన్వేష్టింగ్‌ ఇన్‌ ద స్టాక్‌ మార్కెట్‌, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులో ఏ కేస్‌ స్డడీ ఆన్‌ ఎలక్ట్రోరల్‌ రీఫామ్స్‌ ఇన్‌ తెలంగాణ నీడ్స్‌, ఇష్సూస్‌ అండ్‌ ఛాలెంజెస్‌ ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.

● సూర్యాపేట జిల్లా కోదాడలోని కేఆర్‌ఆర్‌ కళాశాల నుంచి ఎకనామిక్స్‌ సబ్జెక్టులో ఇంపాక్ట్‌ ఆఫ్‌ లేబర్‌ మైగ్రేషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ డ్యూ టు కోవిడ్‌ 19 ఏ కేస్‌ స్టడీ ఇన్‌ సూర్యాపేట డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ తెలంగాణ, ఫిజిక్స్‌ సబ్జెక్టులో రెన్యూవబుల్‌ ఎనర్జీ అండ్‌ రీసోర్సెస్‌.

● హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి తెలుగు సబ్జెక్టులో రూపొందించిన ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.

● యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఫిజిక్స్‌ సబ్జెక్టులో యూజెస్‌ ఆఫ్‌ డ్రోన్‌ టెక్నాలజీ ఏ స్పెషియల్‌ రెఫరెన్స్‌ టు అగ్రికల్చర్‌, తెలుగు సబ్జెక్టులో డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య జీవితం సాహిత్యంపై రూపొందించిన ప్రొజెక్టులు ఎంపికయ్యాయి.

త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement