ముగిసిన పూర్వగిరీశుడి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట రూరల్: పూర్వగిరి లక్ష్మీనరసింహాస్వామి (పాతగుట్ట) ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. చివరి రోజు శతఘటాభిషేకంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. స్వామివారికి ఆలయ ముఖ మండపంలో 108 కలశాలను వరుస క్రమంలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి, అష్టోత్తర శతఘటాభిషేక వేడుకను నిర్వహించారు. అనంతరం ఆ జలంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. ఈ పూజల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ భాస్కర్‌రావు, ఏఈఓలు జూషెట్టి కృష్ణగౌడ్, గజవెల్లి రమేష్, బాబు, రఘు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి అర్జిత సేవలు పునరుద్ధరణ
బ్రహ్మోత్సవాల సందర్బంగా ఈ నెల 3వ తేదీ నుంచి రద్దైన అర్జిత సేవలు, నిత్య, శాశ్వత కల్యాణాలు, సుదర్శన నారసింహా హోమాలు వంటి పూజలు శుక్రవారం నుంచి యధావిథిగా కొనసాగుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు.
చివరిరోజు ఘనంగా శతఘటాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment