మా భావాలు కలిశాయి
ప్రేమ వివాహాలతో అంతరాలు తొలగుతాయి
ఇద్దరం అట్టడుగు వర్గాల పక్షాన పోరాడే సంస్థల్లో పనిచేశాం. నాది కొడంగల్ కాగా, నా భర్త వెంకటేశ్వర్లు పురం న్యాయవాది. ఆయనది నల్లగొండ పట్టణం బీటీఎస్. నేను మొదట అరుణోదయ సంస్థలో పని చేయగా, నా భర్త పీడీఎస్‌యూలో పని చేసేవారు. మా ఇద్దరి భావాలు, భావజాలం ఒక్కటే కావడంతో ఒకరినొకరం ఇష్ట పడ్డాం. ప్రేమించుకున్న నాలుగేళ్ల తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. 2018లో దగ్గరి బందువులు, సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో స్టేజీ మీద దండలు మార్చుకొని ఒక్కటయ్యాం. కులం, మతం లాంటి అంతరాలు పోవాలంటే ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు అభ్యంతరాలు చెప్పినా వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. – అనితాకుమారి, లెక్చరర్, ఎంజీ యూనివర్సిటీ
తల్లిదండ్రులను గౌరవించాలి
తల్లిదండ్రులు మనమీద ఎన్నో ఆశలు పెట్టుకొని కళాశాలకు పంపుతున్నారు. వాళ్ల ఆశలను నీరుగార్చుకుండా ఏకాగ్రతతో చదవుకొని ఉద్యోగం సాధించాలనే తప్పన పెట్టుకోవాలి. తల్లిదండ్రుల కుదుర్చిన పెళ్లి చేసుకోవాలి.
–ప్రశాంతి, విద్యార్థిని
ఫ మా కుటుంబాలు ఒప్పుకున్నాయి
ఫ మేము పనిచేసే ఉద్యమ సంస్థే మా పెళ్లి చేసింది
ఫ ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఏ సమస్యా ఉండదు
ఫ జీవితంపై స్పష్టమైన అవగాహన తప్పనిసరి
‘సాక్షి’తో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు
నకిరేకల్: ‘మేము విప్లవ, ప్రగతిశీల ఉద్యమంలో పనిచేశాం. మా ఇద్దరి జీవిత లక్ష్యం ఒక్కటే కావడంతో కలిసి బతకాలనుకున్నాం. మా కులాలు వేరైనా ఇరు కుటుంబాలు కమ్యునిస్టు భావజాలం కలిగినవి కావడంతో మా పెద్దలు పెళ్లికి అంగీకరించారు. ఆనాడు మేము పనిచేస్తున్న ఉద్యమ సంస్థే మాపెళ్లి జరిపించింది. ప్రేమిస్తే.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు’ అని చెబుతున్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ వారిని పలకరించగా.. ప్రేమ, పెళ్లిపై వారి మనోగతాన్ని వెల్లడించారు.
ఒక విజన్ ఉండాలి
పెళ్లి అనేది.. ఇద్దరి మనస్సులు, వ్యక్తిత్వాలు, రెండు జీవితాలు.. భవిష్యత్‌కు సంబంధించిన నిర్ణయం. ప్రేమ అంటే మానవీయ విలువలతో పాటు కుల మతాలకతీతంగా రెండు మనస్సులు కలిసి కడదాకా బాధ్యతలను పంచుకుని కలిసి సాగడం. ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహలు చేసుకునే వారు భవిష్యత్ సంబంధించి ఒక విజన్ ఏర్పరుచుకోవాలి. జీవితంపై ఒక స్పష్టత ఉంటే.. ఎలాంటి సమస్యా ఉండదు. తాత్కాలిక ఎమోషన్‌తో నిర్ణయాలు తీసుకుంటే.. అనేక చిక్కులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రేమ, పెళ్లికి ముందు.. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, గుణగణాలు, అలవాట్లు, అభిరుచులు, ఆలోచన ధోరణి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని స్పష్టమైన అవగాహనతో నిర్ణయం తీసుకుంటే జీవనం సాఫీగా సాగుతుంది.
భరోసా కల్పించాలని
హైకోర్టు ఆదేశం
చివ్వెంల(సూర్యాపేట) : పరువు హత్యకు గురైన జిల్లా కేంద్రానికి చెందిన మాలబంటి అలియాస్ కృష్ణ కుటుంబాన్ని మూడు వారాల్లో కలెక్టర్, ఎస్పీ కలిసి భరోసా కల్పించాలని గురువారం హైకోర్టు ఆదేశించినట్లు హైకోర్టు న్యాయవాది ఎద్దు దివాకర్ తెలిపారు. తమకు న్యాయం జరగడం లేదంటూ మాలబంటి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.
జీవితంపై స్పష్టత అవసరం
ప్రేమించడం, ప్రేమించబడడం, ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోడడం తప్పు కాదు. సమాజంలో ఉండే కులాలు, కుటుంబాలు, భార్యభర్తలు మధ్య ఉండే వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. కులాంతర వివాహమైనా.. కులంలో పెళ్లి అయినా ఇరువైపులా తల్లిదండ్రులను ఒప్పించి పెద్దల సహకారంతో చేసుకునే పెళ్లిళ్లకు సహకారం, నిబద్దత ఉంటాయి. ఒకవేళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా ఇరువురు.. ఒక అవగాహనతో ప్రేమ, జీవితంపై స్పష్టతతో పెళ్లి చేసుకున్నా.. హ్యపీగా ఉండొచ్చు.
మా భావాలు కలిశాయి
మా భావాలు కలిశాయి
మా భావాలు కలిశాయి
Comments
Please login to add a commentAdd a comment