అభివృద్ధి పనుల పరిశీలన
నాగారం : శివరాత్రి పండుగను పురస్కరించుకుని తన స్వగ్రామమైన నాగారం మండల కేంద్రంలోని శివాలయం వద్ద సొంత ఖర్చులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ నెల 26న జరిగే శివరాత్రి పండుగ సందర్భంగా ఆలయానికి రహదారి, భక్తులకు నీటి సౌకర్యం కల్పించడానికి వాటర్ ట్యాంక్, పైప్‌లైన్, ఆలయానికి మెట్లు నిర్మిస్తున్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు గుండగాని అంబయ్యగౌడ్, కూరం వెంకన్న, కత్తుల వెంకన్న, కన్నెబోయిన కుమార్, చిప్పలపల్లి మల్లేష్, బాలమణి, బొబ్బలి లింగమల్లు, మల్లయ్య, సంజీవ, కృష్ణ, బాలస్వామి, అంజయ్య, చింటూ పాల్గొన్నారు.
బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
హుజూర్‌నగర్ : గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం హుజూర్‌నగర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్లగొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 90 నియోజకవర్గాల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, అన్నింటిలో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ప్రభారీ ఆర్ రుక్మారావు, బీజేపీ రాష్ట్ర నాయకురాలు చల్లా శ్రీలత, టీచర్స్ ఎమ్మెల్సీ అసెంబ్లీ కో ఆర్డినేటర్ బాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన పంటలు తెచ్చి మద్దతు ధర పొందాలి
భానుపురి (సూర్యాపేట) : రైతులు నాణ్యమైన పంట ఉత్పత్తులు మార్కెట్‌కు తీసుకొచ్చి ప్రభుత్వం అందిచే మద్దతు ధర పొందాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉప సంచాలకుడు అజ్మీరా రాజు అన్నారు. గురువారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డును ఆయన సందర్శించి మాట్లాడారు. పంటలను కోసిన తర్వాత ఆరబెట్టడంతోపాటు శుభ్రం చేసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో కొనసాగుతున్న కందులు, ఇతర పంటల కొనుగోళ్లను పరిశీలించారు. రైతులు, మార్కెట్ సిబ్బంది, వ్యాపారులతో మాట్లాడి పంటల రకాలు, మద్దతు ధర, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. మార్కెట్‌కు ప్రస్తుతం అధికంగా వస్తున్న కందులకు మద్దతు ధర అందడం లేదని గుర్తించి వివరాలు సేకరించారు. మిషన్ల ద్వారా కోయడం వల్ల తేమశాతం, గింజ పగిలి ఉండడంతో వ్యాపారులు ధర పెట్టడం లేదని అధికారులు ఆయనకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
16న కబడ్డీ
క్రీడాకారుల ఎంపిక
గరిడేపల్లి : మండలంలోని రాయినిగూడెం గ్రామంలో సబ్ జూనియర్ జిల్లాస్థాయి బాలబాలికల కబడ్డీ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ కర్తయ్య, కబడ్డీ అసోసియేషన్ మండల అధ్యక్షుడు నరేష్‌గౌడ్ గురువారం తెలిపారు. ఈ నెల 16న రాయినిగూడెం గ్రామంలోని పాఠశాల క్రీడా మైదానంలో సబ్ జూనియర్ బాల బాలికల కబడ్డీ జిల్లా సెలక్షన్స్ జరుగుతాయని ఇందులో పాల్గొనే క్రీడాకారులు 16 సంవత్సరాల లోపు ఉండి 55 కిలోల బరువు గల వారై ఉండాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు బోనఫైడ్, పదో తరగతి మెమో, ఆధార్ కార్డుతో హాజరుకావాలన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 20 నుంచి 23 వరకు వికారాబాద్‌లో జరగనున్న 34వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
అభివృద్ధి పనుల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment