సంతోష్‌బాబును స్ఫూర్తిగా తీసుకోవాలి
సూర్యాపేటటౌన్ : మహావీర చక్ర కల్నల్ సంతోష్‌బాబును యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సంతోష్‌బాబు సతీమణి బిక్కుమల్ల సంతోషి అన్నారు. గురువారం వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోష్ బాబు 42వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్‌బాబు చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య కల్యాణ మండపంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు ప్రారంభించారు. పేదలకు అన్నదానం చేశారు. అనంతరం సంతోషి మాట్లాడుతూ కల్నల్ సంతోష్‌బాబు ఆశయాలను నెరవేర్చడానికి ముందుంటామని వాసవి క్లబ్స్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సూర్యాపేట జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు తోట శ్యాంప్రసాద్, వాసవి యూత్ క్లబ్ రీజియన్ సెక్రటరీ యామా సంతోష్, యూత్ క్లబ్ అధ్యక్షుడు వెంపటి రవితేజ, వాసవి క్లబ్ అధ్యక్షుడు మంచాల శ్రీనివాస్, సింగిరికొండ రవీందర్, పబ్బతి వేణుమాధవ్, బిక్కుమల్ల కృష్ణ, పబ్బతి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment