మట్టపల్లిలో విశేష పూజలు
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనలు, విశేష పూజలు కొనసాగాయి. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామిని పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. ఆ తర్వాత నిత్య కల్యాణాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు.
హుండీ ఆదాయం రూ.13.08 లక్షలు
మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు. గతనవంబర్ 22నుంచి గురు వారంవరకు హుండీల ద్వారా రూ.12,72,342, అన్నదానం హుండీ ద్వారా రూ.36,460లతో కలిపి మొత్తం రూ.13,08,802 ఆదాయం సమకూరింది. కొబ్బరి చిప్పల సేకరణకు నిర్వహించిన వేలానికి రూ.2,45,000 ఆదాయం వచ్చిందని, ఈ వేలాన్ని ఏపీకి చెందిన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన బి.అంజిరెడ్డి కై వసం చేసుకున్నట్లు ఈఓ పేర్కొన్నారు.
మట్టపల్లిలో విశేష పూజలు
Comments
Please login to add a commentAdd a comment