యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రఽభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. అనంతరం గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల జోడు సేవను ఆలయంలో ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment