
నేడు పెద్దగట్టుకు మంత్రి ఉత్తమ్ రాక
చివ్వెంల: మండలంలోని దురాజ్‌పల్లి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతర సందర్భంగా లింగమంతులస్వామి వారిని సోమవారం ఉదయం 8 గంటలకు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. పార్టీలోని అన్ని స్థాయిల కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు హాజరు కావాలని కోరారు.
నేడు విద్యాసంస్థలకు సెలవు : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సోమవారం లోకల్ హాలీడేగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి పెద్దగట్టు జాతర సందర్భంగా సెలవు ప్రకటించామని పేర్కొన్నారు.
గోదావరి జలాల పునరుద్ధరణ
అర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను వారబందీ విధానంలో జిల్లాకు ఇస్తున్న గోదావరి జలాలను ఆదివారం పునరుద్ధరించారు. అయితే శనివారం విడుదల చేయాల్సి ఉండగా ఒక్కరోజు ఆలస్యంగా వదిలారు. కాగా 400 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతుండడంతో చివరి ఆయకట్టుకు అందని పరిస్థితి నెలకొంది. ఈ నీళ్లు తూములకు ఎక్కే అవకాశం లేదని, వెంటనే 1,500 క్యూసెక్కులకు నీటిని పెంచాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంంగా ఆలయంలో సుప్రబాతసేవ, విశేష పూజలు, హోమం, పంచామృతాభిషేకం, అర్చనలు చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. ఆ తర్వాత కల్యాణతంతు పూర్తిచేసి నీరాజన మంత్ర పుష్ఫాలతోమహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం..
మట్టపల్లి క్షేత్రంలోని శివాలయంలో ఆదివారం శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా పూజలు, అర్చనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు పాల్గొన్నారు.
26న అఖండ జ్యోతి
రథయాత్ర ప్రారంభం
భువనగిరి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చేపట్టనున్న స్వామి వారి అఖండజ్యోతి రథయాత్ర ఈ నెల 26న హైదరాబాద్‌లోని బర్కత్‌పురలో గల యాదాద్రి భవనం నుంచి ప్రారంభం కానుందని రథయాత్ర ఆహ్వాన కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఎంపల్ల బుచ్చిరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో భువనగిరి, బీబీనగర్, యాదగిరిగుట్ట భక్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉప్పల్, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి మీదగా రథయాత్ర సాగుతుందని, మార్చి1న యాదగిరిగుట్టకు చేరుకుంటుందన్నారు. అఖండ జ్యోతి రథయాత్రకు ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. సమావేశంలో రథయాత్ర ఆహ్వాన కమిటీ ఉపాధ్యక్షుడు కాసుల సత్యనారాయణగౌడ్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ దిడ్డి బాలాజీ, ప్రధాన కార్యదర్శి బండారు ఆగమయ్య, గడ్డం జ్ఞానప్రకాష్‌రెడ్డి, అశోక్, ఉపేందర్, గణపతి తదితరులు పాల్గొన్నారు.

నేడు పెద్దగట్టుకు మంత్రి ఉత్తమ్ రాక
Comments
Please login to add a commentAdd a comment