
చికెన్ అమ్మకాలు డౌన్
80 శాతం అమ్మకాలు
పడిపోయాయి
బర్డ్‌ఫ్లూ ప్రచారంతో చికెన్ అమ్మకాలు 80 శాతం వరకు పడిపోయాయి. ఆదివారం రోజు 1600 కిలోల చికెన్ అమ్ముడు పోయేది. ఇప్పుడు 150 కిలోలు మాత్రమే అమ్ముడు పోయింది. నిన్న, మొన్నటి వరకు కొంతమేర అమ్మకాలు సాగగా.. రిజర్వాయర్‌లో కోళ్లు తేలడంతో అమ్మకాలు తగ్గడానికి కారణమైంది.
– సలీమొద్దీన్,
చికెన్ వ్యాపారి, నల్లగొండ
నల్లగొండ టూటౌన్: ఆదివారం వచ్చిందంటే చాలు దాదాపు ప్రతి ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. కానీ బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ అంటేనే వామ్మో అంటున్నారు. గత పది, పదిహేను రోజుల నుంచి బర్డ్‌ఫ్లూతో కోళ్లు చనిపోతుండడంతో చికెన్ అంటేనే భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు ప్రతి ఆదివారం సరాసరిగా 2.80 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు సాగిస్తుంటారు. కానీ ఈ ఆదివారం ఒక్కసారిగా చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఆదివారం రోజు కేవలం 50వేల కేజీల వరకు చికెన్ అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. గతంతో పోలిస్తే మూడింతల అమ్మకాలు పడిపోయినట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో 60వేల కేజీల నుంచి 80 వేల కేజీల వరకు అమ్మకాలు సాగిస్తుంటారు. కానీ అక్కంపల్లి రిజర్వాయర్‌లో చనిపోయిన కోళ్లను పడవేయడంపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం కావడంతో నల్లగొండ జిల్లాలో చికెన్ అమ్మకాలపై బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ పడింది. దీంతో ఆదివారం రోజున చికెన్ అమ్మకాలు లేక దుకాణాలన్నీ వెలవెలబోయాయి. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదని ప్రకటించినా చనిపోయిన కోళ్లు రిజర్వాయర్‌లో ప్రత్యక్షం కావడంతో ఈ ఎఫెక్ట్ చికెన్ అమ్మకాలపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు.
శుభకార్యాల్లో నో చికెన్..
ఏ చిన్న ఫంక్షన్ చేసినా చికెన్ ఉండాల్సిందే. పెద్ద శుభకార్యాల్లో అయితే చికెన్‌తో పలు రకాలుగా వంటలు చేసి పెడుతారు. శనివారం నల్లగొండలో ఫంక్షన్ ఉంటే ఒక అతను 60 కేజీల చికెన్ తీసుకెళ్లాడు. ఫంక్షన్ కు వచ్చిన వారు చికెన్‌కు దూరంగా ఉన్నారు. 60 కిలోల చికెన్‌లో కేవలం 6 కేజీల చికెన్ మాత్రమే తినగా ..మిగతా చికెన్ మిగిలిపోయింది. బర్డ్‌ఫ్లూ ప్రచారంతో ఇటు చికెన్ కొనలేక దాని స్థానంలో మటన్, చేపలు పెట్టాల్సి వస్తుండడంతో ఫంక్షన్‌లు చేసే వారికి కూడా ఖర్చు భారీగా పెరుగుతోంది.
వెలవెలబోతున్న దుకాణాలు
ఫ గతంలో ఒక్క ఆదివారమే 2.80లక్షల కేజీలకు పైగా అమ్మకాలు
ఫ బర్డ్‌ఫ్లూ ప్రచారంతో తగ్గిన గిరాకీ
ఫ ఆందోళనలో వ్యాపారులు
వ్యాపారుల ఉపాధిపై ఎఫెక్ట్..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హోల్‌సేల్ వ్యాపారులు ఐదారుగురు వర్కర్లను పెట్టుకొని చికెన్ దుకాణాదారులకు అందిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో చికెన్ అమ్మకాలు లేకపోవడంతో చికెన్ వ్యాపారులతో పాటు, వాటిల్లో పనిచేసే వర్కర్ల ఉపాఽధిపై కూడా ప్రభావం పడింది.

చికెన్ అమ్మకాలు డౌన్
Comments
Please login to add a commentAdd a comment