హుజూర్‌నగర్ రూరల్: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాకుండా చేస్తున్న కాంగ్రెస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్ మండలం వేపలసింగారంలో ఆదివారం తాజా మాజీ సర్పంచ్ అన్నెం శిరీషాకొండారెడ్డి తన తండ్రి అన్నెం వెంకట్‌రెడ్డి జ్ఞాపకార్థం గ్రామ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్‌ను బీఆర్‌ఎస్ పార్టీ హుజూర్‌నగర్ నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ ఒంటెద్దు నర్సింహారెడ్డితో కలిసి జగదీష్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సమగ్ర కుటుంబ సర్వేలో ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని వివరాలు తెలిపారన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపోందడం కోసమే కులగణన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. తెలంగాణ జాతిపితగా కేసీఆర్.. ప్రజలందరి మనస్సులో ఉంటారన్నారు. ఈనెల 19న న్విహించనున్న మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రూ.5 లక్షల సొంత ఖర్చుతో ఉచిత అంబులెన్స్‌ను ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ అన్నెం శిరీషాకొండారెడ్డి దంపతులను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, సారెడ్డి భాస్కర్‌రెడ్డి, నందిరెడ్డి సైదిరెడ్డి పరశురాం, వీరయ్య, శంభిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మారెడ్డి హరిలీల, రాజమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment