
జాతరలో పటిష్ట బందోబస్త్ కల్పిస్తున్నాం
చివ్వెంల (సూర్యాపేట): పెద్దగట్టు జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్త్ కల్పిస్తున్నామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. ఆదివారం రాత్రి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల లైవ్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. గుట్ట చుట్టూ, పైన భద్రత చర్యలు, పోలీస్ బందోబస్తు, ఎగ్జిబిషన్ రోడ్డు, కోనేరు, వీఐపీ మార్గం, హైవేపై వాహనాల రద్దీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దైవదర్శనం కల్పించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఏఎస్సీ నాగేశ్వర్‌రావు, డీఎస్పీలు రవి, శ్రీధర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment