
ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనే సంతృప్తి
నల్లగొండ: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కలిగే సంతృప్తి మరెందులో రాదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న పార్కులో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రిగా ఉన్న ఎంత బిజీగా ఉన్నప్పటికీ నల్లగొండ నియోజకవర్గ ప్రజల కోసం ప్రజాదర్బార్‌ను కొనసాగిస్తామని తెలిపారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రజాదర్బార్‌కు అధికారులను పిలువలేదని పేర్కొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment