పట్టణాల్లోని యజమానులు స్థానిక మున్సిపల్ సిబ్బందితో కుమ్మకై ్క ఆస్తి విలువ తక్కువగా చూపించి తక్కువ పన్నులు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై గతంలోనే మున్సిపల్ పాలకవర్గ సమావేశాల్లో లేవనెత్తాయి. అలాగే వాణిజ్యపరమైన ఆస్తిని నివాస గృహంగా చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి అవకతవకలు, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఆస్తిని ఉపగ్రహ ఆధారిత మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు నెలల్లో దీనిని పూర్తి చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విధానం ప్రజలకు ఎంతో మేలు జరగడంతోపాటు ప్రభుత్వానికి కూడా ఆస్తిపన్ను రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment