విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వం
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ ఆరోపించారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించి అభివృద్ధి పర్చాలని, పెండింగ్ స్కాలర్‌షిప్ ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఏటా విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అక్కినపల్లి వినయ్, దీపక్, నాని, వీరబాబు, అజయ్ గోపి, మేఘన, నవ్య, జ్యోతి, కావ్య పాల్గొన్నారు.