జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి
సూర్యాపేటటౌన్ : శాసనసభలో రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. జగదీష్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడారు. జగదీష్‌రెడ్డికి క్షమాపణలు చెప్పాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నిమ్మల శ్రీని వాస్‌గౌడ్, వై.వి, ఆకుల లవకుశ, జీడి భిక్షం పాల్గొన్నారు.