నేడు పోలీస్ గ్రీవెన్స్ డే
సూర్యాపేట టౌన్: సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్టు ఎస్పీ నర్సింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చివరి విడతగా నేటి
నుంచి గోదావరి జలాలు
అర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను జిల్లాలోని ఎస్సారెస్పీ రెండోదశ పరిధిలోని ఆయకట్టుకు వారబందీ విధానంలో చివరి విడతగా సోమవారం గోదావరి జలాలను పునరుద్ధరించనున్నారు. ఈ నీళ్లు ఈనెల 24 వరకు రానున్నాయి. అయితే ఈ యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు వారబందీ పద్ధతిలో జనవరి 1 నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు తడులలో నీటిని ఇచ్చారు. ఆరవ తడికి గాను సోమవారం విడుదల చేయనున్నారు. ఇది ఆఖరి విడత అని నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని బయ్యన్నవాగు డీఈఈ ఎం.సత్యనారాయణ కోరారు.
సూర్యక్షేత్రంలో
ప్రత్యేక పూజలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించారు. తెల్ల వారుజామున ఉషా పద్మిని ఛాయసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. ఆతర్వాత యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. ఆదిత్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకుడు, సౌర ఆరాధకులు జనార్దన్‌స్వామి, గణపురం నరేష్, కర్నాటి నాగేశ్వర్‌రావు, ఇంద్రారెడ్డి, కాకులారపు రజిత, అర్చకులు భీంపాండే, శ్రీరాంపాండే, అంకిత్‌పాండే, భక్తులు పాల్గొన్నారు.
నేడు, రేపు
జాతీయ సెమినార్
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమ, మంగళవారాల్లో జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ (ఐసీఎస్‌ఎస్‌ఆర్) ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీగ్రోత్ పొటెన్షియాలిటీస్ ఇన్ తెలంగాణ స్టేట్ ప్రాస్పెక్ట్ అండ్ చాలెంజెస్‌శ్రీ అనే అంశంపై తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషనల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఈ.పురుషోత్తం, ప్రొఫెసర్లు జి.యాదగిరి, ఎం.రాములు, ముత్యంరెడ్డి, ఇంద్రకాంత్, పున్నయ్య, కొప్పుల అంజిరెడ్డి, వాసుదేవశర్మ ప్రసంగించనున్నారు. చివరి రోజున ఐసీఎస్‌ఎస్‌ఆర్ డైరెక్టర్ బి.సుధాకర్‌రెడ్డి సందేశంతో సెమినార్ ముగియనుంది.
నేడు పోలీస్ గ్రీవెన్స్ డే