ఘనంగా శ్రీజయరాం స్వామి జాతర
చివ్వెంల : మండల పరిధిలోని జయరాంగుడి తండాలో శ్రీ జయరాం స్వామి జాతరను ఆదివారం గిరిజనులు ఘనంగా నిర్వహించారు. సుమారు 200 సంవత్సరాల చరిత్ర గల ఈ జాతరకు జిల్లా నుంచే కాకుండా ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వందలాది మంది గిరిజన భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర రెండు రోజులపాటు జరగనుంది. జాతర సందర్భంగా వెలిసిన దుకాణాల వద్ద మొదటి రోజుల భక్తుల రద్దీ భారీగా ఉంది. వేడుకల్లో మాజీ ఎంపీపీ ధరావతు కుమారి బాబు నాయక్, గ్రామ మాజీ సర్పంచ్‌లు హాలవత్ సుశీల, కె.శారదదేవి, ధరావత్ పద్మమంగ్త్యా నాయక్, మాజీ ఎంపీటీసీ బానోతు లచ్చిరాం నాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుగులోతు చీనానాయక్ తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు తప్పని తాగునీటి కష్టాలు..
దూర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఆటోలలో జాతరకు వచ్చిన భక్తులకు తాగునీటి కష్టాలు తప్పలేదు. ప్రతి సంవత్సరం జాతరకు వేలాది రూపాయల ఆదాయం వస్తున్నా నిర్వాహకులు కనీస వసతుల కల్పనలో అలసత్వం వహిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. తాగునీటి వసతి లేకపోవడంతో వ్యవసాయ పొలాలను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాల్గొన్న వేలాది మంది భక్తులు