టెన్త్ విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక కానుక
ఫ పరీక్ష కిట్‌ల పంపిణీ
ఫ కలెక్టర్ ప్రత్యేక నిధులతో ప్రభుత్వ
పాఠశాలల విద్యార్థులకు అందజేత
ఫ ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
ఫ జిల్లాలో 6,968 మందికి ప్రయోజనం
సూర్యాపేటటౌన్, అనంతగిరి : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సాహించడంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ప్రత్యేక చొరవ చూపారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే సంకల్పంతో వారికి బాసటగా నిలిచేందుకు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక నిధులతో పరీక్ష కిట్‌లు పంపిణీ చేశారు. ఈ కిట్‌లో పరీక్ష ప్యాడ్‌తో పాటు జామెట్రిక్ బాక్స్, ఐదు బ్లూ పెన్నులు, ఒక బ్లాక్ పెన్ను, ఒక రెడ్ పెన్ను, ఒక పెన్సిల్, ఒక స్కేల్ ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని పంపిణీ చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 6,968 మంది పదో
తరగతి విద్యార్థులు
జిల్లాలో మొత్తం 11,912 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనుండగా అందులో ప్రభుత్వ యాజమాన్య విద్యార్థులు 6,968 మంది ఉన్నారు. ఇందులో ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 180 పాఠశాలల్లో 3,997 మంది , 18కేజీబీవీల్లో 597 మంది , తొమ్మిది మోడల్ స్కూళ్లలో 672 మంది, 25 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1,702 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరికి పరీక్ష కిట్‌లకు ఒక్కో విద్యార్థికి రూ.147 చొప్పున ఖర్చు చేయగా మొత్తం సుమారు రూ.10,24,296 కేటాయించారు.
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా...
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. నవంబర్ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను సంసిద్ధం చేశారు. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు పాఠశాలలను సందర్శిస్తూ పదో తరగతి విద్యార్థులపై దృష్టి సారించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ ఏడాది కూడా ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అల్పాహారం సైతం ఇస్తుండటంతో విద్యార్థులు శ్రద్ధతో ప్రత్యేక తరగతుల్లో పాల్గొని పరీక్షలకు సిద్ధమయ్యారు.
విద్యార్థులు సద్వినియోగం
చేసుకోవాలి
కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ ఈ ఏడాది ప్రత్యేక చొరవ తీసుకొని పదో తరగతి విద్యార్థులకు తన ప్రత్యేక నిధులతో పరీక్ష కిట్ పంపిణీ చేశారు. ఈ కిట్ విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి.
– అశోక్, డీఈఓ
కలెక్టర్ నిర్ణయం గొప్పది
జిల్లాలో మొదటిసారి పపదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ పరీక్ష సామగ్రిని కానుకగా అందించారు. పేద విద్యార్థులకు మేలు కలగనుంది. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా కలెక్టర్‌సార్ తీసుకున్న నిర్ణయం గొప్పది.గతంలో దాతలు ఇస్తేనే తప్ప విద్యార్థులు వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఉండేది.
– సలీం షరీఫ్, ఎంఈఓ
మాకు కిట్లు ఇవ్వడం
సంతోషంగా ఉంది
జిల్లా కలెక్టర్ సార్ మాకు పరీక్ష కిట్లు ఇస్తున్నారని వినగానే సంతోష పడ్డాను. పరీక్షలు రాసేందుకు మనోఽఽఽ ధైర్యం కలిగింది. మాఽథ్స్ , సైన్స్ పరీక్షల్లో ఈ వస్తులు ఎక్కువగా ఉపయోగ పడతాయి.
– మీసాల వశీకర్, పదో తరగతి,
జెడ్పీహెచ్‌ఎస్, అమీనాబాద్
పరీక్షలంటే భయం పోయింది
మాది పేదకుటుంబం. పరీక్షలు అనగానే సాధారణంగా కొంత భయం ఉంటుంది. జిల్లా కలెక్టర్ సార్‌మాకు పరీక్ష సామగ్రి అందించడం ఆనందంగా ఉంది. పరీక్షలపై ఉన్న భయం పోయి మంచిగా రాయాలనే భావనలోకి వెళ్లిపోయాం.
– వడ్డే రాజేశ్వరి, పదవ తరగతి, అమీనాబాద్
టెన్త్ విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక కానుక
టెన్త్ విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక కానుక
టెన్త్ విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక కానుక
టెన్త్ విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక కానుక
Comments
Please login to add a commentAdd a comment