మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకం
భానుపురి (సూర్యాపేట) : వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ అన్నారు. బుధవారం సూర్యాపేటలో పార్టీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం వర్ధంతి సందర్భంగా రైతాంగ సమస్యలు– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌కు హాజరయ్యారు. తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన దాడులను, ఘర్షణలు హత్యల నుంచి పార్టీ క్యాడర్ ను కాపాడారన్నారు. అంతకకు ముందు మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, జె.నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, కొప్పుల రజిత, శేఖర్, ఎల్గూరి గోవింద్, పులుసు సత్యం తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్
Comments
Please login to add a commentAdd a comment